17, జనవరి 2021, ఆదివారం

ntr namo..namami...

 ఎన్టీయార్ నమో .. నమామి 

నీవు  లేని  తెలుగు  జాతి  కుక్కలు  చింపిన  విస్తరి  లా  మారింది .. 

నీవు లేని  తెలుగుజాతి ఆత్మ గౌరవం  ఈన గాచి  నక్కల  పాలైంది .. నిన్ను వంచించి  ,అవమానాల  పాలు చేసిన  నేతలు ..,నిస్సిగ్గుగా  ఢిల్లీ  పాలకులకు  గులాములై  బానిస బాట  పట్టి  ప్రజలను వంచిస్తూన్నారు .. కుక్కమూతి  పిందెల్ల  ప్రవర్తిస్తూ  స్వార్ధ  చింతనతో  ఆశయాలు  తుంగ లో  తొక్కి సిగ్గు  లేకుండా  నీ  ఫోటో  పెట్టుకుని  చెట్టు పేరు చెప్పి  కాయ లు  అమ్ముకుంటున్నారు .. 

నీ జ్ఞాపకాల  నీడలో  మేము నిస్సహాయులమై జీవశ్చవా ల మై  బ్రతుకు లీడుస్తున్నాము .. 

తెలుగు జాతి  మనుగడ  ఉన్నంత  కాలం సూర్య చంద్రులు ప్రాకాశించినంత  వరకు  నీ  కీర్తి  అజరా మరం  గా  నిలిచిపోతుంది .. 

జై  ఎన్టీయార్ .. జై  తెలుగు  తల్లి 


ntr symbol of the telugu pride,,and self respect





 

remembering ntr...its a pleasure to every telugu person








 

Sr. Ntr rare photos